కట్టుకున్న భర్తే క్షుద్ర పూజలతో తనని చంపాలని చూస్తున్నాడు

10చూసినవారు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో ఓ వివాహిత తన భర్తపై క్షుద్ర పూజలు చేయిస్తున్నాడని ఆరోపించింది. తన ఫోటోను మాంత్రికులకు ఇచ్చి తనను చంపాలని చూస్తున్నాడని కవిత అనే మహిళ కన్నీటిపర్యంతమైంది. మర్రిచెట్టు కింద భయానక వాతావరణంలో బాధితురాలి ఫోటో ముందు నిమ్మకాయలు, పిండి బొమ్మలతో పూజలు జరిగినట్లు సమాచారం. తన భర్త గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడి, తమ ఇద్దరి పిల్లల్లో ఒకరిని హతమార్చాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్