మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

1229చూసినవారు
మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొల్లికుంటలో రజకుల ఆరాధ్య దైవం మడేలేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మడేలేశ్వర స్వామి ఆశీస్సులు డివిజన్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్