ఏనుమాముల లో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

3చూసినవారు
ఏనుమాముల లో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
ఏనుమాముల సీఐ జవ్వాజి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర బుల్తానాకు చెందిన షేక్ షకీల్, అతని స్నేహితులు బబ్లూ @ నిజాం, షఫీక్ షా అనే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. వీరు గతేడాది నుంచి వేర్వేరు జిల్లాల్లో నకిలీ నంబర్ ప్లేట్లు గల కారును ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నారు. ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన కార్ల నంబర్ల ద్వారా చిరునామాలు సేకరించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్