పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. హనుమకొండ జిల్లాలో 98.56%, భూపాలపల్లిలో 98.36%, జనగామలో 97.47%, వరంగల్ జిల్లాలో 95.25% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలపై ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లావారీగా ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి: హనుమకొండ 12065 మందికి 11891, భూపాలపల్లి 3541 మందికి 3483, జనగామ 6443 మందికి 6292, వరంగల్ 9485 మందికి 9034 మంది పాస్ అయ్యారు.