ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేటలోని నాగారం గ్రామ చెరువు దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్లు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని గుర్తించిన గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య సంతోష్ ఆదివారం వాటిని తొలగించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గరిగే ప్రశాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ మాచర్ల శ్రీనివాస్,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావుల శ్రీకాంత్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.