ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేటలో శుక్రవారం పర్వతగిరి మండల గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానికంగా జరిగిన ముఖ్య సమావేశంలో సభ్యులందరి సమక్షంలో ఈ కమిటీని ప్రకటించారు. తీగల వీరస్వామి గౌడ్ నూతన అధ్యక్షుడిగా, కక్కర్ల ఏకాంబరం గౌడ్ ఉపాధ్యక్షుడిగా, మడ్డి వెంకన్న గౌడ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రంగు కుమారస్వామి గౌడ్, దొనికని సదానందం గౌడ్, ముంజ శ్రావణ్ గౌడ్, చీకటి యాకన్నా గౌడ్, బత్తిని రంజిత్ గౌడ్, గిరిగాని యాకన్న గౌడ్, బంధారపు రంజిత్ గౌడ్, పుల్లూరు రజనీకాంత్ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.