వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలతో హాజరై అధికారులకు వివరాలు అందజేయవచ్చు. అందిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు.