మడికొండ డంపింగ్ యార్డులో రూ.4 కోట్ల క్యూబా బయో మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం

1చూసినవారు
మడికొండ డంపింగ్ యార్డులో రూ.4 కోట్ల క్యూబా బయో మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం
హనంకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ రాంపూర్ గ్రామంలోని 46వ డివిజన్ డంపింగ్ యార్డులో మంగళవారం, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన నూతన క్యూబా బయో మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. హైదరాబాద్ నుండి వరంగల్ కు వచ్చే మార్గంలో మడికొండ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, లింగమూర్తి, శంకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్