
తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కపై దాడి
తిరుపతిలోని భూపాల్ హౌసింగ్ కాలనీలో మంగళవారం చిరుతపులి సంచారం కలకలం రేపింది. దాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుక్కపై దాడి చేసి చంపి లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అటవీశాఖ అధికారులు చిరుత జాడను కనిపెట్టేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. మంగళం అటవీప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.




