మక్కలు కొనే నాధుడు లేక మార్కెట్లో 20 రోజులు

1366చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మొక్కజొన్న రాశులతో నిండిపోయింది. రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్ఫెడ్ ద్వారా 2530 రూపాయల మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ కు మొక్కజొన్నలు విక్రయించాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనే నాధుడు లేక మార్కెట్లో 20 రోజుల నుండి నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్