వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12 వార్డు సభ్యులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రకటించారు. అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యేకు ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ప్రజల మద్దతు చూసి ప్రత్యర్థులు అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.