హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని KIT S కాలేజ్, X ROAD చౌరస్తా సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, రాంగ్ రూట్ లో వస్తున్న ఒక కారును అడ్డుకుని, సరైన క్రమంలో వెళ్లే వరకు వదలిపెట్టలేదు. ఈ సంఘటన ఎర్రగట్టు గుట్ట క్రాస్ రోడ్, హసన్ పర్తి KIT S కాలేజ్ క్రాస్ రోడ్ లోని సిగ్నల్ వద్ద జరిగింది. కానిస్టేబుల్ తన విధిని సక్రమంగా నిర్వహించి, నిబంధనలను పాటించని వ్యక్తిని అడ్డుకున్నారు.