
కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదుపరి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మే 29న జరిగే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను అధికారికంగా ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను సమతుల్యం చేయడానికి ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉంది.




