పర్వతగిరి మండలం మల్యా తండాలో జొన్నలు పట్టే మిషన్ ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చి దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు రైతులు, బానోతు రాములు, బానోతు హర్లా, ప్రమాదానికి గురయ్యారు. మిషన్ పల్టీ కొట్టడంతో రాములు అక్కడికక్కడే మృతిచెందగా, హర్లా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది రైతులు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం.