జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు బూతుల పరిధిలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు నీళ్లు, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారని ఆయన ఆరోపించారు.