వర్ధన్నపేట: లారీలు ఢీ.. రాంధాన్ తండా వాసి మృతి

72చూసినవారు
వర్ధన్నపేట: లారీలు ఢీ.. రాంధాన్ తండా వాసి మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధాన్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ సమీపంలో జాతీయ రహదారి 563పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండాకు చెందిన గుగులోతు గణేశ్ (38) మృతి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని చెలరేగిన మంటల్లో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనం కాగా అందులో గణేశ్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్