వరంగల్: కడియం శ్రీహరిపై ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు

1559చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీకి షాకిస్తూ భారత రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలో అనేక మందిని రాజకీయంగా ఎదగకుండా చేసిన కడియం శ్రీహరిపై ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయ్యి, వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమికి కడియం కారణమయ్యారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్