బీసీల హక్కులు, అధికారాలు, రాజకీయ చైతన్యం కోసం తీన్మార్ మల్లన్న రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ కాకముందు ఆయన పాదయాత్ర కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అయితే ఈ సారి ప్రతీ గ్రామంలో పర్యటించి.. బీసీల సమస్యలను తెలుసుకోవమే కాకుండా.. వెనుకబడిన తరగతుల రాజకీయ సాధికారతకు కావాల్సిన మద్దతును కూడా తీన్మార్ మల్లన్న కూడగట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.