వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది, కొత్త ఆశలు, కోరికలు, లక్ష్యాలు, ఆశయాలు, నిర్ణయాలు, ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సుభిక్షతను అందించాలని కోరారు. గత ఏడాది ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు.