వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండా గ్రామానికి చెందిన దంపతులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఈ నెల 24న బంధువు అస్థికలను భద్రాచలం గోదావరిలో కలిపి బొలేరో వాహనంలో తిరిగి వస్తుండగా ములుగు జిల్లా కొండపర్తి స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భద్రు (45) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య సరోజన (40) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఈ దంపతులకు వివాహితులైన కుమారుడు, కుమార్తె ఉన్నారు.