వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు వరుసగా రెండు రోజులుగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వండర్ హాట్, 341 రకాల మిర్చి సాగు చేసిన రైతులకు మంచి లాభాలు దక్కుతున్నాయి. మార్కెట్లోకి మిర్చి రాకడ తగ్గడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. బుధవారం గరిష్ట ధర ₹37,100 ఉండగా, గురువారం ₹900 పెరిగి ₹38,000కు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.