వరంగల్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్వహించనున్న సమావేశానికి పర్వతగిరి మండల
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. మండల అధ్యక్షుడు వినోద్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కుడికాల శ్రీధర్, యువ మోర్చా అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్ కుమార్, బూత్ అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేటలో నిర్వహించబడుతోంది.