పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకుల ప్రాణాలను రక్షించి మానవత్వాన్ని చాటిన నజాకత్ అలీకి ఘన స్వాగతం లభించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఈ యువకుడు ఇటీవల ఛత్తీస్‌గడ్‌లోని చిరిమిరి ప్రాంతానికి వెళ్లగా, స్థానికులు అతన్ని ఆత్మీయంగా స్వాగతించి సన్మానించారు. ప్రతి ఏడాది చలికాలంలో ఉన్ని దుస్తులు అమ్మేందుకు వెళ్తుండేవాడని, ఈసారి లభించిన గౌరవంతో నజాకత్ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, ఉగ్రదాడి సమయంలో అతను చూపిన ధైర్యానికి ‘హీరో ఆఫ్ హ్యుమానిటీ’గా ప్రశంసలు అందుకుంటున్నాడు.