ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


భార్యపై కక్షతో కూతురిపైనే లైంగిక దాడి.. తండ్రి అరెస్ట్
Aug 08, 2026, 02:08 IST/

భార్యపై కక్షతో కూతురిపైనే లైంగిక దాడి.. తండ్రి అరెస్ట్

Aug 08, 2026, 02:08 IST
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భర్త తన భార్య స్నేహితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. తర్వాత అత్తమామల ఇంటికి వెళ్లిన భర్త, నాలుగేళ్ల కుమార్తెను తనతో పంపమని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళాక నిద్రిస్తున్న ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పిన్ని రక్తస్రావాన్ని గమనించి తల్లికి చెప్పడంతో, ఆసుపత్రిలో వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.