ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా నీళ్లను తరలించుకుపోతుంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాట్లాడుతూ.. కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా కావాలనే నీటిని కిందకు వదులుతున్నారని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, '
కాంగ్రెస్ తెచ్చిన కరువు' అని ఆరోపించారు. ఆంధ్రాకు నీళ్లు తరలిపోతుంటే తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మిగులుతున్నాయని మండిపడ్డారు.