వేసవిలో దాహం తీర్చుకోవడంలో పుచ్చకాయకు సాటి లేదని, ఇందులో 90% పైగా నీరు ఉంటుందని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. మామిడి పండులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండి తక్షణ శక్తిని ఇస్తుందని, అయితే ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందంటున్నారు. పుచ్చకాయ శరీరాన్ని చల్లబరుస్తుందని, పోషకాల పరంగా మామిడిలో విటమిన్-A, విటమిన్-C పుష్కలంగా ఉంటాయని, పుచ్చకాయలో లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయన్నారు. శక్తి కోసం మామిడి, ఎండ వేడిమికి పుచ్చకాయ తినాలంటున్నారు.