మేమంతా సురక్షితంగా ఉన్నాం: ట్రంప్

3చూసినవారు
మేమంతా సురక్షితంగా ఉన్నాం: ట్రంప్
వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా, వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించారని కొనియాడారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. తనతో పాటు మెలానియా, జేడీవాన్స్‌, క్యాబినెట్‌ సభ్యులందరినీ వెంటనే అక్కడి నుంచి తరలించామని, తామంతా సురక్షితంగా ఉన్నామని వెల్లడించారు. కాగా డిన్నర్‌లో దాదాపు 2600 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దుండగుడు 6-7 రౌండ్లు కాల్పులు జరిపినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్