TG: విద్యార్థుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామన్నారు. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌కు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులక కోసం వంద సమీకృత హాస్టళ్లను నిర్మిస్తున్నామన్నారు. బీసీల అభివృద్ధి గురించి విపక్ష నేతలు మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు.