TG: తాము బుల్లెట్ ట్రైన్‌కి వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బుల్లెట్ ట్రైన్ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఏడాదిన్నర తర్వాత ప్రజల దయతో
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా బహదూర్‌గూడ రైతులకు పట్టా భూములు ఇస్తారని మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు.