పంట కొనాల్సి వస్తుందనే నీళ్లు ఇవ్వడం లేదు: హరీశ్ రావు

4చూసినవారు
TG: సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేయడం రాక, రైతులపై ప్రేమ లేకపోవడంతో సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం యాదాద్రి జిల్లా పర్యటనలో మాట్లాడుతూ.. పంట కొనాల్సి వస్తుందనే నీళ్లు ఇవ్వడం లేదని, ఉచిత విద్యుత్‌ ఇస్తే బిల్లులు చెల్లించాల్సి వస్తుందనే కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఉండగా.. ఇప్పుడు 7-8 గంటలే ఇస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్