సోయా కొనుగోళ్లకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం: మంత్రి తుమ్మల

11చూసినవారు
సోయా కొనుగోళ్లకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం: మంత్రి తుమ్మల
TG: సోయా పంట కొనుగోళ్లకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సోయా పంట దిగుబడి ఎక్కువగా ఉందన్నారు. వీలైతే ఎమ్మెల్యేలను ఢిల్లీ పంపించి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాగా సోయా పంట కొనుగోలు చేయాలని ఆదిలాబాద్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్