భార‌త్‌తో చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం: పాక్ విదేశాంగ మంత్రి

53చూసినవారు
భార‌త్‌తో చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం: పాక్ విదేశాంగ మంత్రి
భార‌తదేశంతో వాణిజ్యం, ఉగ్ర‌వాదంపై చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అన్నారు. భార‌త్ స్పంద‌న కోసం తాము ఎదురు చూస్తున్న‌ట్లు ఇషాక్ దార్ వెల్ల‌డించారు. చ‌ర్చ‌ల‌ విష‌యంపై భార‌త్ తుది నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. కొద్ది రోజుల క్రితం పాక్ ప్ర‌ధాని సైతం భార‌త్‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌తిపాద‌న‌లు చేశారు. అయితే దీనిపై మన దేశం స్పందించ‌ లేదు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్థాన్‌తో పూర్తిగా దౌత్య సంబంధాల‌ను తెంచుకున్న విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్