పంజాబ్‌లోని జలంధర్‌లో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు తమ పనే అని ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (KLA) తాజాగా ప్రకటించింది. తమ మిలిటెంట్ రంజిత్ సింగ్ మృతికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారని ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో గుర్దాస్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రంజిత్ సింగ్ పోలీసుల చేతిలో మరణించాడు.