'ది ప్యారడైజ్' సినిమాలో
కేసీఆర్ పాత్ర పోషించిన ప్రియదర్శి, ఆ పాత్ర కోసం తాను చేసిన రీసెర్చ్ గురించి వివరించారు. ముఖ్యంగా
కేసీఆర్ అసలు బట్టలు ఎక్కడ కొంటారు, ఎలాంటి చెప్పులు వేసుకుంటారు, వాచ్ ఎలా పెట్టుకుంటారు వంటి విషయాలపై లోతుగా అధ్యయనం చేశానని తెలిపారు. ఈ పాత్ర వెనుక ఎంతో రీసెర్చ్, పనితనం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలోని శంకరన్న పాత్ర కోసం కూడా చాలా రీసెర్చ్ చేశామని ప్రియదర్శి తెలిపారు.