TG: హిందువుల్లో 3 కోట్ల దేవుళ్లు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాడికి మరో దేవుడు ఉన్నాడు. మందు తాగేవాళ్లకు, పప్పన్నం, మాంసం తినేవాళ్లకూ దేవుళ్లు ఉన్నారు' అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగినవారు ఉంటారని ఆయన తెలిపారు. దేవుడిపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు పార్టీలో ఎలా ఉంటుందని సీఎం అన్నారు.