ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో, అమెరికా వద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని, విజయవంతంగా యుద్ధం చేయగలమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా కోసం ఉన్నతశ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లోనూ నిల్వ చేసినట్లు చెప్పారు. తన పాలనలో మిలిటరీని మెరుగుపర్చానని, అమెరికా వద్ద నిల్వలు భారీ విజయాలు సాధించేంతగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము ఇప్పటివరకు పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది.