తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం రూ.13లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి భాజపా అండగా నిలిచిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్,
కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చాయని విమర్శించారు. అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ఆర్థిక స్థితి దెబ్బతినిందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భాజపా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.