AP: విద్యుత్ రంగానికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు 30 పైసలు తగ్గిస్తామని ఆయన తెలిపారు. పంచాయతీల్లో 90 శాతం పన్నులు ఆన్‌లైన్‌లోనే చెల్లించారని, ఇది పరిపాలనలో పారదర్శకతకు నిదర్శనమని పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.