ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుతుందని తాను ముందే చెప్పినట్లు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒక్క రోజులోనే రూ.993 పెరిగిందని, ఫిబ్రవరి నుంచి 3 నెలల్లో రూ.1,380 (81 శాతం) పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల టీస్టాల్, దాబా, హోటల్, బేకరీ నిర్వాహకులు ఇబ్బందులు పడతారని, త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.