TG: కేసీఆర్ ప్రభుత్వ అప్పులు లెక్కలతో సహా చెప్పామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవాలు చెప్తుంటే హరీశ్‌రావు, కేటీఆర్ తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే వాళ్లని ప్రజలు గద్దె దింపారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరిట రూ.1.20 లక్షల కోట్లు బూడిదలో పోశారని ఆరోపించారు. BRS, BJP ఒక్కటేనని అందరికీ తెలుసని, దేవుని పేరు చెప్పి మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.