బీజేపీ ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్

3చూసినవారు
బీజేపీ ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్
TG: బీజేపీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలని చూస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి BJP ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలని సూచించారు. 'చేయి గుర్తు అంటే అభయ ముద్ర. అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే. అదే మన సిద్ధాంతం. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలి' అని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్