TG: రాష్ట్రంలో విద్యుత్ కోతలపై
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని తాము ముందే చెప్పామని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు పడుతున్నాయని ఆయన అన్నారు.
కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చామని, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిందని
కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ కావాలా.. కరెంట్ కావాలా అని అడిగినప్పుడు తాము చెప్పిందే ఇప్పుడు జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.