
తల్లిని పెళ్లి చేసుకునేందుకు కొడుకును చంపిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాఠి అనే మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్న జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్, ఆమె ఏడాదిన్నర కొడుకు ఆరవ్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. శనివారం బాలుడికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి, నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విరాజ్ కోసం గాలింపు చేపట్టారు. మణిపూర్ రోడ్ వద్ద దాక్కున్న విరాజ్ పోలీసులపై కాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో అతని కాలికి గాయమైంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.




