బియ్యం అక్రమ రవాణాపై తనిఖీలు జరుగుతున్నాయని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకొని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశాన్ని తాము కూడా గతంలో ప్రశ్నించామని.. ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ పర్యటన ద్వారా తమ వాదనకు బలం చేకూరిందని చెప్పారు.