
కుంకీ ఏనుగులకు ఆధార్ తరహా గుర్తింపు కార్డులు
AP:రాష్ట్ర ప్రభుత్వం కుంకీ ఏనుగులకు ఆధార్ కార్డు తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులను తీసుకురానుంది. ఇందుకోసం డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం రక్త నమూనాలను సేకరించి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. అక్కడ డీఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాత ఏనుగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు తగిలించనున్నారు. ఈ కార్డుల్లో ఏనుగుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. భవిష్యత్తులో వైద్యం, జన్యుపరమైన సమస్యలకు ఈ కార్డు ఉపయోగపడుతుంది.




