ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం

14చూసినవారు
TG: ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తామనిమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని, ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అఖిలపక్ష పార్టీల నుంచి, ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్ట్, న్యాయవాదుల నుంచి సూచనలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. కవులు, కళాకారులతో పాటు తెలంగాణ సాధన కోసం పనిచేసిన అందరినీ గుర్తిస్తామని, ఈ ప్రక్రియ అమరవీరుల ద్వీపంలో ప్రారంభమవుతుందని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు.