అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం: మంత్రి శ్రీహరి

34చూసినవారు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం: మంత్రి శ్రీహరి
TG: ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతీ పేదవానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల పరిధిలోని మిట్ట సదగోడు గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇల్లు లేక పేదలు ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షల రూపాయలతో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :