నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్

11చూసినవారు
నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పేరును 'ఇందూరు'గా మార్చాల్సిన అవసరం ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ అరవింద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ జిల్లా పేరు నిజామాబాద్ గా పెట్టడం వల్లే దురదృష్టం వచ్చిందని, ఆ పేరులోనే నష్టం ఉందని అన్నారు. అరవింద్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు మద్దతు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును ఖచ్చితంగా 'ఇందూరు'గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్