ఇరాన్ ఎయిర్‌లైన్స్‌ను మూసివేస్తాం.. అమెరికా మరో వార్నింగ్

84చూసినవారు
ఇరాన్ ఎయిర్‌లైన్స్‌ను మూసివేస్తాం.. అమెరికా మరో వార్నింగ్
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా మరోసారి హెచ్చరికలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇరానియన్ ఎయిర్‌లైన్స్‌ను మూసివేస్తామని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. విదేశీ సంస్థలు ఇరాన్‌కు సేవలు కొనసాగిస్తే సెకండరీ శాంక్షన్స్ విధిస్తామని హెచ్చరించారు. ఆ విమానాలకు విదేశాల్లో ల్యాండింగ్, ఫ్యూయల్ సదుపాయం ఇవ్వకూడదని, ఎవరైనా ఉల్లంఘిస్తే డాలర్ సిస్టమ్ నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం ఇరాన్ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్