రైతులకు ఎవరు ఏం చేశారో తేల్చుకుందామంటూ గతంలో సీఎం విసిరిన సవాల్‌ను తాము స్వీకరించి ప్రెస్‌క్లబ్‌కు వెళ్లినా ప్రతిపక్షాలు రాలేదని
కేటీఆర్ పేర్కొన్నారు. మళ్లీ సవాళ్లు విసురుతున్నారని, చర్చకు సిద్ధంగా ఉన్నామని, సీఎం ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తామని తెలిపారు. మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తానని డైలాగులు వేశారని, ఆయన కోసం ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చుంటే రాకుండా ఇప్పుడు ఎక్కడో కూర్చొని సేమ్ డైలాగులు వేస్తున్నారని
కేటీఆర్ విమర్శించారు.